ప్రజలకు సరైన సేవలను అందించండి


Wed,June 26, 2019 12:49 AM

-ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆయా కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు
రేగోడ్ : ప్రజలకు అధికారులు సరైన సేవలను అందించాలని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రం రేగోడ్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పార్టీ నాయకులకు, అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యే రావడంతో ఆయా కార్యాలయాల్లో ఒక్కసారిగా సందడి నెలకొన్నది. మొదటగా మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి సిబ్బందితో మాట్లాడి పథకాల అమలు, రుణాలు, పింఛన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో బస్వన్నప్ప విధుల్లో లేకపోవడంతో ఎంపీడీవో రోజూ వస్తాడా... రాడా అని ఆరా తీశారు. అనంతరం దవాఖానను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. రోగులను కలిసి వారికి అందుతున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని తెలిపారు. డాక్టర్లు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మందులను పరిశీలించి ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత మెరుగైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ లచ్చాలు, హెల్త్ సూపర్‌వైజర్ ఈశ్వర్‌గౌడ్, సర్పంచులు రమేశ్, సిద్ధ్దారెడ్డి, రవిందర్, ఉమ్మడి జిల్లాల టీఆర్‌ఎస్ నాయకుడు కృష్ణ, నాయకులు రాధాకిషన్, చంద్రశేఖర్‌యాదవ్, భూంరెడ్డి, నాగయ్యస్వామి, డబ్బుల రాజు, ఎస్‌ఎంసీ చైర్మన్ సాయిలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...