లైంగికదాడులపై కఠిన చర్యలు


Wed,June 26, 2019 12:48 AM

రేగోడ్ : లైంగికదాడుల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం లైంగికదాడి యత్నానికి గురైన మండల పరిధిలోని కొత్వాన్‌పల్లి గ్రామానికి చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో ఇలాంటి సంఘటన జరుగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారని లైంగికదాడులకు ప్రయత్నించే వ్యక్తులపై అమ్రత్తంగా ఉండి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. బాధిత బాలిక కుటుంబానికి తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తానని భరోసా ఇచ్చారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...