జిల్లాను అభివృద్ధి చేసుకుందాం


Wed,June 26, 2019 12:48 AM

మనోహరాబాద్ : టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలంతా శ్రమించి మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుకుందామని జెడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ పిలుపునిచ్చారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజా కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను, ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసి వాటిని పరిష్కరించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణ అభివృద్ధికై పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు ర్యాకల కృష్ణాగౌడ్, ఆత్మకమిటీ డైరెక్టర్ రతన్‌లాల్, నాయకులు ర్యాకల నానిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...