సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


Wed,June 26, 2019 12:48 AM

మెదక్ నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మెదక్ నియోజకవర్గంలోని 43 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.12 లక్షల 27వేల చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పద్మాదేవేంర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానలో వైద్యం చేసుకున్న ప్రతి పేదవారికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు వెంకట్మ్రణ, శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ కో-కన్వీనర్ జీవన్‌రావ్, టీఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...