పండుగలా..


Tue,June 25, 2019 12:16 AM

-జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ భవన నిర్మాణానికి భూమిపూజ
-ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన చేసిన జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత
-హాజరైన తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, ఎంపీపీలు,

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జిల్లా కేంద్రంమైన మెదక్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి సోమవారం జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల సమీపంలోని సర్వే నంబర్ 78లో ప్రభుత్వం ఒక ఎకరా స్థలం కేటాయించింది. ఈ స్థలంలో శంకుస్థాపన కార్యక్రమం కార్యకర్తలు, నాయకులు తరలిరగా శంకుస్థాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భూమి పూజ చేస్తున్న సమయంలో కార్యకర్తలు, నాయకులు పటాకులు కలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. కోదండ రామాలయం పూజారి భాష్యం మధుసూదనాచారి ఆధ్వర్యంలో బ్రాహ్మణులు, జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డిలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు అరగంట పాటు వేదమంత్రోచ్ఛరణలతో ప్రాంతం దద్దరిల్లింది. జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలు మంగళహారతులతో భూమి పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు.
సర్వమత ప్రార్థనలు...
టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన భూమి పూజాకార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు చేశారు. ముందుగా రామాలయం పూజారి మధుసూదనాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ముస్లిం మత పెద్దలు ఖాజామైనొద్దీన్, మైనార్టీలు అష్రఫొద్దీన్, సయ్యద్ ఉమ్మర్, షేక్ హమీద్, గఫార్, సాదిక్ అలీ, ముజీబ్ తదితరులు ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చి పాస్టర్లు అసిస్టెంట్ ప్రెసిబీటర్ రెవరెండ్ విజయ్‌కుమార్, అశోక్, జాయ్‌ముర్రె తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
భూమి పూజ చేసిన జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు..
జిల్లా కేంద్రమైన మెదక్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డిలు భూమి పూజాకార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ముందుగా గుణపంతో జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డిలతో కలసి భూమి పూజ నిర్వహించారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్వీ కో-ఆర్డినేటర్ జీవన్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోములు, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు సరాఫ్ యాదగిరి, జితేందర్‌గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఏడుపాయల దేవాలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు తొడుపునూరి చంద్రపాల్, టీఆర్‌ఎస్ నాయకులు జయరాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్, గడీల శ్రీనివాస్‌రెడ్డి, పట్లోరి రాజు, జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...