గ్రామాలను ఆదర్శంగా చేద్దాం


Tue,June 25, 2019 12:11 AM

కొల్చారం: కొల్చారం మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్తగా ఎంపికైన పంచాయతీ పాలకవర్గాలు స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా రోడ్లు శుభ్రం చేయడం, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలిగించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి బస్తాల్లో ప్యాకింగ్ చేసి రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. సోమవారం కొల్చారంలో మురుగు కాల్వల్లో పేరుకుపోయిన మట్టిని తరలించే కార్యక్రమాన్ని వార్డు సభ్యులు వెంకన్నగారి కృష్ణ దగ్గరుండి చేయిస్తున్నారు. అలాగే కొంగోడులో నాలుగో వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే కొంగోడు గ్రామానికి జూన్ 2న జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్వచ్ఛ భారత్ అవార్డు దక్కించుకోగా, నాలుగో వారం ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం నిషేధంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వానకాలం సీజన్ వచ్చినందున కలుషిత తాగునీటితో రోగాలు వస్తాయని ముందస్తుగా సోమవారం వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ ఫౌడర్ వేసి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ దగ్గరుండి చేయించారు.
చిలిపిచెడ్‌లో...
చిలిపిచెడ్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం సర్పంచులు, గ్రామ కార్యదర్శులు గ్రామసభలు, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టగా ఎంపీడీవో కోఠిలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తే పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దుకోవచ్చన్ని వెల్లడించారు. అలాగే సోమక్కపేట, సామ్లాతండాలో మరుగుదొడ్లు నిర్మించుకోని వారికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

కౌడిపల్లిలో...
కౌడిపల్లి: పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సర్పంచ్ సుజాతకాంతారావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కూకుట్లపల్లిలో సోమవారం సర్పంచ్ సుజాతకాంతారావు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల గుండా చెత్తాచెదారాన్ని శుభ్రపర్చి, ప్లాస్టిక్ కాగితాలను ఏరివేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కూకుట్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుదామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గ్రామాన్ని శుభ్రపర్చడంలో యువత పాత్ర ఎక్కువగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...