జిల్లా కళాకారులకు కళారత్న అవార్డులు


Tue,June 25, 2019 12:10 AM

మెదక్, నమస్తే తెలంగాణ: జిల్లా సాంస్కృతిక కళాకారులకు కళారత్న ఆవార్డులు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో కళానిలయం సాంస్కృతిక సంఘ సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన సమాచార పౌర సంబంధాల శాఖలో విధులు నిర్వహిస్తున్న నాగరాజు, నెనావత్ మదన్‌సింగ్, మాధవిలు మాజీ కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్, జస్టిస్ మధుసూదన్ తదితరుల అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో పలు వేదికలపై తెలంగాణ చరిత్రను తెలియజేస్తూ తమ పాటల ద్వారా ప్రజలకు తెలియజేసిందుకు గాను, గ్రామీణ స్థాయిలోప్రజలకు పర్యావరణం, నిరాక్షరాస్యత, మహిళావివక్ష, ఆరోగ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పలు అంశాలపై అవగాహనక కల్పించినందుకు కళారత్న అవార్డులకు ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు
టేక్మాలో
టేక్మాల్: వివిధ రంగాల్లో సేవలందించిన టేక్మాల్ మండలానికి చెందిన ఇరువురికి శ్రీ కళానిలయంలో అవార్డులను ప్రధానం చేశారు. మండల పరిధిలోని కాదులూర్ తండాకు చెందిన నేనావత్ మదన్‌సింగ్ తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆటపాటలతో తోడ్పాటు అందించాడు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం మెదక్ జిల్లా సమాచార పౌరసరఫరాల శాఖలో పనిచేస్తూ తెలంగాణ సాంస్కృతికి సారథిగా అన్ని రంగాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యాన్ని పెంపొందిస్తున్నాడు. దీనికి ఫలితంగా తెలంగాణ కళారత్న అవార్డు లభించింది. అలాగే గొల్లగూడెం గ్రామానికి చెందిన సొంగ సాయిలు యువజన సంఘాలలో పనిచేస్తూ సామాజిక సేవాకార్యక్రమాలతో యువతను చైతన్యం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వీరిరువురికి హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ భవన్‌లో కళానిలయం ఆధ్వర్యంలో ఆదివారం అవార్డులను అందజేశారు. మాడభూషి శ్రీధర్, జస్టిస్ మధుసూదన్, స్టార్9 సీఈవో మహ్మద్ షాబుద్దీన్ అవార్డులను అందజేశారు.
ఉత్తమ సేవలకు సేవారత్న అవార్డులు
అల్లాదుర్గం: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్తమ సేవలను అందించినందుకుగాను అల్లాదుర్గం మండలానికి చెందిన ఇద్దరు తెలంగాణ సేవారత్న అవార్డులను అందుకున్నారు.త్యాగరాయ గాన సభ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన బ్రహ్మం,క్రిష్ణమూర్తిలు తెలంగాణ సేవారత్న అవార్డులను అందుకున్నారు.రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్,మాజీ సమాచార కేంద్ర కమిషనర్ మాడభూషి శ్రీధర్,న్యాయమూర్తి మధుసూదన్ పురస్కారాన్ని అందజేశారు.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకుగాను బ్రహ్మం,తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆట,పాటలతో ఉద్యమకారులను చైతన్య పరిచినందుగాను కృష్ణమూర్తి సేవారత్న పురస్కారాలకు ఎంపికయ్యారు.
సేవారత్న పురస్కారం అందుకున్న
మిన్పూర్ యువకులు
పాపన్నపేట: ఆటపాటలతో అలరిస్తు ప్రజల చైతన్య పరుస్తు గాయకులకు తెలంగాణ సేవారత్న పురస్కారం దక్కింది. వివరాల్లోకి వెళ్లితే పాపన్నపేట మండలంలోని మిన్పూర్ గ్రామానికి చెందిన అల్లారం ప్రేమ్‌కుమార్, నాయికోటి భిక్షపతి, అల్లారం పాపయ్యలు గత 18 సంవత్సరాలుగా ఆట పాటలతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను ఎంతగానో చైతన్య పరిచారు. వీరి సేవకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సంబురాల్లో భాగంగా ఆదివారం శ్రీ త్యాగరాయ గానసభ హైదరాబాద్ నందు వీరికి తెలంగాణ సేవారత్న పురస్కారం అవార్డులు అందజేశారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...