హరితహారం విజయవంతం చేయాలి


Tue,June 25, 2019 12:09 AM

మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్ని గ్రామాలలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని , ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని జేసీ నగేశ్ జిల్లా అధికారులను సూచించారు. ఇందుకోసం అన్ని మండలాల ప్రత్యేక అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్‌లోని ప్రజావా ణి హాల్‌లో జిల్లా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రుతుపవనాల కారణంగా జిల్లాలో వర్షా లు పడుతున్నందున జిల్లాలో హరితహారం కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో దశల వారీగా ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విదించి ప్లాస్టిక్ కవర్లు దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలలో ప్లాస్టిక్ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని పలు గ్రామాలలో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసేలా జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించడానికి సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. చెత్త ను కాల్చి వేయడం వల్ల కలిగే అనర్థాలను వారికి తెలియజేయాలన్నారు. అలాగే ప్రతి గ్రామంలోని మహిళా సంఘాలను సంఘటితం చేసి వారికి తడి పోడి చెత్తను వేరుచేసే విధానాలపై అవగాహన పెంపొందించాలన్నారు. ఈసందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు రెవెన్యూ అంశాలపై 84 దరఖాస్తులు ఇత ర అంశాలపై 21 దరఖాస్తులు వచ్చాయి.
మొత్తం 105 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టరేట్ ఏవో యాదగిరి తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి న్యాయమైన వాటిని సత్వరం పరిష్కరించాలని జిల్లా అధికారులకు జేసీ నగేశ్ సూచించారు. ఈకార్యక్రమంలో డిఆర్వో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో సీతారామారావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...