రెండో పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్య ఆత్మహత్య


Tue,June 25, 2019 12:08 AM

మెదక్ మున్సిపాలిటీ : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఆ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. జిల్లా అధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేపడుతున్నా ఆ శాఖలో జరుగుతున్న సంఘటనలు పోలీసు శాఖపైనే మచ్చతెచ్చే విధంగా ఉంటున్నాయి. తాజాగా ఇలాం టి సంఘటనే జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకార ం.. .మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన బండి శ్యామ్‌కుమార్ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన లహరి(34)తో 2010 మే 28వ తేదీన వివాహం జరిగింది. పది సంవత్సరాల పాటు వీరి కాపురం సాఫీగానే జరిగింది. అయితే కానిస్టేబుల్ శ్యామ్‌కుమార్ 2015లో నిజామాబాద్‌కు చెందిన స్వప్నను రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో వీరి కాపురంలో చిచ్చు మొదలైంది. మొదటి భార్య లహారితో అనేక సార్లు గొడువలు కూడా జరిగాయి. ఈ నెల 11వ తేదీన మెదక్ పట్టణంలో లహరి అన్నదమ్ములతో పాటు కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రెండో భార్య స్వప్నను వదిలిపెట్టాలని, మొదటి భార్య లహారితో ఉండాలని ఒప్పందం కూడా చేసుకున్నారు. అయినా శ్యామ్‌కుమార్‌లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్తపానికి గురైన మొదటి భార్య లహరి ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పెద్ద ఎత్తున మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మృతురాలు లహరి అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వెంకట్ తెలిపారు. మృతురాలు లహరి మరణంతో దాయర వీధిలో విషాదచాయలు అలుముకున్నాయి.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...