పేదరికానికి చదువు అడ్డంకి కాదు


Sun,June 23, 2019 06:58 AM

చేగుంట: పేదరికానికి చదువు అడ్డంకి కాదని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని పాఠశాలకు, తల్లీదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల పదోతరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మండలకేంద్రమైన చేగుంటలోని ఆదర్శపాఠశాలలో శనివారం పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు ఎం.వెంకట్‌రెడ్డి, హరిరంజన్‌శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్ని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఫలితాలు వచ్చేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను సన్మానించి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ చదువుకు పేదరికం సమస్య కాదన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపితానికి మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోవిద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు మంచి ఫలితాలు రావడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంకోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని వారు తెలిపారు. కుటుంబంలో ఒక్కరు ఉన్నత స్థాయికి వెళ్తే తరతరాలుగా వారి వంశం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా రఘోత్తంరెడ్డి తెలిపారు.కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, చేగుంట ఎంపీపీ అల్లిరమ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంఈవో యాదగిరి, వివిధ పాఠశాలల ఎచ్‌ఎంలు కె గంగాబాయి, నీరాజ, మురళి, కిషన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, టీ తిరుపతి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అల్లి విజయసేనారెడ్డి, చల్ల లక్ష్మణ్, రామకృష్ణ, గందె పాండు, సలీం ఉన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...