జిల్లాకు రూ.206 కోట్ల రుణాలు


Sun,June 23, 2019 06:57 AM

చిన్నశంకరంపేట: ఈ ఏడాది జిల్లాలోని 10,964 మహిళా సంఘాలకు రూ.206 కోట్ల బ్యాంకు లింకేజి రుణాలను అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి భీమయ్య తెలిపారు. శనివారం చిన్నశంకరంపేటలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో 192 కోట్ల బ్యాంకు లింకేజి రుణాలను అందించామన్నారు. ఈ ఏడాది మరిన్ని మహిళా సంఘాలకు రుణాలు అందించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో 520 గ్రామ సమైక్య సంఘాలు 20 మండల సంఘాలు, మ్యాక్స్ ద్వారా రిజిష్టరై ఉన్నాయన్నారు. వీటి కార్యకలాపాలను సీఏ ద్వారా ఆడిటింగ్ కొనసాగుతుందన్నారు. విద్యావంతులైన 45 సంవత్సరాల లోపు మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ నాయకత్వ మార్పులు చేపడుతున్నామన్నారు. జిల్లాలో డిజిటల్ అకౌంట్స్ సిస్టాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రయోగాత్మకంగా చిన్నశంకరంపేట మండలాన్ని తీసుకుంటున్నామన్నారు. సంఘాలలో జరిగిన లావాదేవిలను ఇంటర్‌నెట్‌లో నమోదు చేస్తామన్నారు. ఈ సదుపాయాన్ని జిల్లాలో ఎ,బి, గ్రేడ్‌లో ఉన్న 8,694 సంఘాలకు వర్తింపజేస్తామన్నారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం వెంకటసామి ఉన్నారు.

రుణాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి భీమయ్య సూచించారు. శనివారం చిన్నశంకరంపేటలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సమైక్యసంఘాల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమయ్య మాట్లాడుతూ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. గవ్వలపల్లిలో మహిళా సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కోటి 84 లక్షల విలువ చేసే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 210 మంది రైతులనుంచి 10744 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 7320 మంది మహిళా సంఘం సభ్యులకు ఆరోగ్యంపై శిక్షణను ఇవ్వడం జరిగిందన్నారు. సేంద్రియ వ్యవసాయం కోసం సంఘాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీపీఎం. కెనాడి, ఎంపీడీవో లక్ష్మణమూర్తి, ఐకేపీఎం వెంకటసామి, సీబీవో ఆడిటర్ నాగరాజు, లాలునాయక్, సీసీలు యశోద, శ్రీనివాస్‌గౌడ్, రాజు, కిషన్, ప్రదీప్ ఉన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...