చిలిపిచెడ్ మండల ఎంపీపీగా వినోదదుర్గారెడ్డి


Sun,June 23, 2019 06:57 AM

చిలిపిచెడ్: ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇటీవలే జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో చిలిపిచెడ్ మండలంలో మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలు ఉండగా నలుగురు టీఆర్‌ఎస్, ఇద్దరు స్వంతంత్ర అభ్యర్థులు ఎంపీటీసీలుగా గెలుపొందారు. ఈ నెల 7వ తేదీన మండల కోఆప్షన్ సభ్యుడుగా మమ్మద్‌షఫీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించగా ఎంపీటీసీ కోరం రాకపోవడంతో వాయిదా వేశారు. అలాగే మళ్లీ ఈనెల 15వ తేదీ ఎన్నిక నిర్వహించగా వాయిదా పండింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికను నిర్వహించారు. ఎంపీపీ అభ్యర్థిగా చిలిపిచెడ్ స్వంతంత్ర ఎంపీటీసీగా గెలుపొందిన రాజన్నగారి వినోదదుర్గారెడ్డిను చిట్కుల్ స్వంతంత్ర ఎంపీటీసీ వట్టిపల్లి సుభాష్‌రెడ్డి ప్రతిపాదించగా, గౌతాపూర్ టీఆర్‌ఎస్ ఎంపీటీసీ సునీతా బలపర్చారు. వైస్ ఎంపీపీగా విశ్వంభరస్వామిను చిలిపిచెడ్ స్వంతంత్ర ఎంపీటీసీగా గెలుపొందిన రాజన్నగారి వినోదదుర్గారెడ్డి ప్రతిపాదించగా, అజ్జమర్రి టీఆర్‌ఎస్ ఎంపీటీసీ మన్నె మల్లయ్య బలపర్చారు. వీరికి ఫైజాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీటీసీ తప్ప మిగిత ఎంపీటీసీలు చేతులెత్తి మద్దతు ప్రకటించడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి దేవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కోఠిలింగం, పంచాయతీ కార్యదర్శి నగేశ్ పాల్గొన్నారు.

ఎంపీపీని సన్మానించిన నాయకులు
కొత్తగా ఎన్నికైన ఎంపీపీ రాజన్నగారి వినోదదుర్గారెడ్డిను మెదక్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, చిలిపిచెడ్ జెడ్పీటీసీ శేషసాయిరెడ్డి, ఆయా గ్రామ సర్పంచులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీకి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.

చిలిపిచెడ్, చిట్కుల్ స్వంతంత్ర ఎంపీటీసీలుగా గెలుపొందిన ఎంపీటీసీలు శనివారం మండల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం చంద్రాగౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...