క్రీడలతో అంకితభావం కలుగుతుంది


Sun,June 23, 2019 06:56 AM

మెదక్, నమస్తే తెలంగాణ: పట్టుదలతో శ్రమిస్తే దేనినైనా సాధించవచ్చని జాయింట్ కలెక్టర్ నగేశ్ అన్నారు. శనివారం ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ద్యాన్‌చంద్ చౌరస్తా నుంచి గుల్షణ్‌క్లబ్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ రన్‌ను జాయింట్ కలెక్టర్ నగేశ్ ప్రారంభించారు. అనంతరం గుల్షణ్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శారీరక శ్రమ వలన మెదడు సైతం చురుకుగా పని చేస్తుందన్నారు. క్రీడల వలన అంకితభావం, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. చిన్న వయస్సులో మాల్లోత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. లక్ష్య సాధనకు కష్టపడితే మరోసారి విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వం విద్య, క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈసారి ఎస్‌జీఎఫ్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు ముందుగానే శిక్షణ శిబిరం ఏర్పాటు కోసం డీఈవోతో చర్చిస్తానన్నారు. అంతకుముందు విద్యాశాఖ నోడల్ అధికారి మధుమోహన్, జిల్లా ఒలింపిక్ కమిటీ కన్వీనర్ జెల్లా సుధాకర్, జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మ్యాడం బాలకృష్ణ మాట్లాడారు. ఈ ఒలింపిక్ రన్‌లో జిల్లా పీఈటీల సంఘం కార్యదర్శి శ్రీనివాస్‌రావు, జిల్లా కార్యదర్శి మహిపాల్ పీఈటీలు ప్రదీప్, హరీశ్, రూపేందర్, చరణ్, ప్రభాకర్, శేఖర్ మనోహర్, మాధవరెడ్డి, శ్రీనివాస్‌రావు, పీడీలు నాగరాజు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...