ప్లాస్టిక్ ఏరివేత అద్భుతం


Sun,June 23, 2019 06:56 AM

నర్సాపూర్‌రూరల్: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం చాలా అద్భుతమైనదని జిల్లా పంచాయతీ అధికారి హనోక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మాడాపూర్ గ్రామపంచాయతీ సూర్యతండాలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనోక్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనోక్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మొదటి విడుతగా గ్రామాల్లో ప్లాస్టిక్‌ని పోగుచేసి గోనె సంచుల్లో నిల్వచేసి హెచ్‌హెమ్‌డీఏకు అప్పగిస్తామని వెల్లడించారు. రెండో విడుతగా ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ను ఆరుబయట వేయకుండా ఇంట్లోనే పోగు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో మంచి స్పందన లభిస్తుందని ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, ఈవోపీఆర్‌డీ నర్సింహారెడ్డి, సర్పంచ్ ఉమ్లానాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...