తెలంగాణకు నవశకం కాళేశ్వరం


Sat,June 22, 2019 12:31 AM

-మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది
-మెదక్‌లో ఘనంగా కాళేశ్వరం సంబురాలు, భారీ ర్యాలీ
-లడ్డూలు పంచిపెట్టిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ మానస పుత్రిక.. తెలంగాణ ప్రజల వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయడం చరిత్రలో లిఖించదగిన రోజు అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ క్యాంప్ కార్యాలయంలో నుంచి రాందాస్ చౌరస్తా వరకు వందలాది మంది టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాందాస్ చౌరస్తాలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కండ్లలో ఆనందం నింపేలా కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే దృఢ సంకల్పంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ప్రశంసలు కురిపించారు. రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు బీడు భూముల్లో బంగారు పంటలు పండించేందుకు రైతులకు అపర భగీరథుడు అయ్యారన్నారు.

తెలంగాణలో సాగు, తాగు నీటి సమస్యలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తొలిగిపోనున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 2లక్షల45 వేల ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. సాగుకే కాకుండా మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని సైతం అందిస్తుందన్నారు. కాళేశ్వరం ద్వారా ఉమ్మడి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ నిండా నీరు ఉంటుందన్నారు. మంజిరానది ఎల్లవేళాలా పారుతుందన్నారు. అంతేగాకుండా జిల్లాలోని ప్రతి చెరువు, కుంటలను కాళేశ్వర ప్రాజెక్ట్‌తో నింపుకోవడం జరుగుతుందన్నారు. ఇంతటి మహోత్తరమైన ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతుల పక్షపాతి.. సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం 24 గంటల కరెంట్‌తోపాటు రైతుబంధు, రైతు భీమా పథకాలును తీసుకోచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులు చల్లగా ఉంటేనే అందరు చల్లగా ఉంటారని కోరుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల పాదాలు గోదావరి జలాలతో తడువాలన్నదే కేసీఆర్ అభిలాష అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కేసీఆర్ చిత్రపటానికి పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్డుగౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్ మున్సిపల్ కౌన్సిలర్లు తదితర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.

భారీ ర్యాలీ.. బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే
టీఆర్‌ఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగిన భారీ ర్యాలీలో మెదక్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో ఉత్సాహంగా కొనసాగిన ర్యాలీలో అడుగడుగునా పటాకులు కాల్చుతూ సంబురాలు నిర్వహించారు. రాందాస్ చౌరస్తాలో మహిళలతో కలిసి పద్మాదేవేందర్‌రెడ్డి బతుకమ్మ ఆడారు.

మిఠాయిలు పంచి పెట్టిన పద్మాదేవేందర్‌రెడ్డి
రాందాస్ చౌరస్తాలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి లడ్డూలను పంచిపెట్టారు. ప్రయాణికులకు లడ్డూలు అందజేశారు.
రామాలయంలో పూజలు,
చర్చి, దర్గాలో ప్రార్థనలు..
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చర్చి, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు, జిల్లా సభ్యుడు చింతల నర్సింహులు, మెదక్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులు చల్లనరేందర్, అకిరెడ్డి కృష్ణారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పుట్టి విజయలక్ష్మి, రమేశ్‌రెడ్డి, గంగాధర్, గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, జీవన్‌రావు, స్వామినాయక్, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు రమణ, మల్లేశం, సలాం, సాధిక్, శ్రీనివాస్, రబ్బీ, జెల్ల గాయత్రి, బట్టి సులోచన, జ్యోతి దొంతి లక్ష్మి, చంద్రకళ, విజయలక్ష్మి, సులోచన ప్రభురెడ్డి, రాజు, సాయిలు, మాజీ కౌన్సిలర్లు, గౌష్‌ఖురేషి, మంగ రమేశ్‌గౌడ్ మెదక్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...