నర్సాపూర్‌ను సస్యశ్యామలం చేస్తా


Sat,June 22, 2019 12:29 AM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ: తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు బీడు భూములను బంగారు భూములుగా మార్చడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మేథస్సు ఉపయోగించి రెండు సంవత్సరాల్లోపే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు అంకితం చేయబోతున్నారని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సంబురాలను నర్సాపూర్ పట్టణంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులుఅర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు మిఠాయిలు తినిపించి ప్రజలకు స్వీట్లు పంచి పటాకులను పెద్ద ఎత్తున కాల్చారు. దాంతో పట్టణంలో అంబేద్కర్ కూడళి గులాబీమయమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవనోపాధిగా మారబోతుందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ అపరభగీరథుడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయినిగా మారబోతుందన్నారు. త్వరలోనే నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు. సీఎం ఆశీస్సులతో నియోజకవర్గానికి అత్యధిక నీళ్లు తీసుకురావాడానికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని అన్నారు. మంజీరా, హల్దీవాగులపై చెక్‌డ్యాం సంవత్సరం వరకు పూర్తయి కాలువల నిర్మాణం కూడా చేపడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చర్మన్ చంద్రాగౌడ్, నర్సాపూర్ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు అశోక్‌గౌడ్, వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, చౌటి జగదీశ్, మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతితో పాటు టీఆర్‌ఎస్ నాయకులు సత్యంగౌడ్, సూరారం నర్సింహులు, మహ్మద్ ఆయా గ్రామాల సర్పంచులు శ్రీరాములు, సేనాధిపతి, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...