యోగా మానసిక ధైర్యాన్నిస్తుంది


Sat,June 22, 2019 12:28 AM

రామాయంపేట: యోగా మానసిక ధైర్యాన్ని ఇస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి డీఏవో పరశురాం నాయక్, యోగా గురువు నవాత్ సురేశ్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివేకానంద విద్యాలయంలో యోగా లోగోను ఆవిష్కరించి యోగా గురువులను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ మనిషి జీవితానికి యోగా అవసరం ఉందని అన్నారు. ఐదేళ్ల పాప నుంచి 90 ఏండ్ల వయస్సు వారైనా యోగాను చేయచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి,రామాయంపేట వ్యవసాయశాఖ అధికారి రాజ్ నారాయణ, విజన్ సంస్థ డైరెక్టర్ వంగరి కైలాస్,యోగా మాస్టర్ మద్దెల భరత్, కైరంకొండ తిరుపతి,లక్ష్మణ్ యాదవ్, రాంకుమార్ యాదగిరి ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...