ఊరూరా ప్రారంభ సంబురాలు


Sat,June 22, 2019 12:28 AM

మనోహరాబాద్ : మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మనోహరాబాద్, రంగాయిపల్లి గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరై సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అదే విధంగా జీడిపల్లిలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో ఏడీఏ సురేఖ, ఏవో రాజశేఖర్, ఏఈవో సచిన్, పార్టీ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, జిల్లా నాయకుడు ర్యాకల కృష్ణాగౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ తీగుళ్ల నాగిరెడ్డి, సర్పంచ్ నాగభూషణం, ఆత్మకమిటీ డైరెక్టర్ బండారి భిక్షపతి, నాయకులు నరేందర్‌గౌడ్, నానిగౌడ్, పురం రవి ముదిరాజ్, తప్పెటి శ్రీనివాస్ ముదిరాజ్, కూచారం నరేశ్ ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూప్రాన్, నమస్తే తెలంగాణ : తూప్రాన్ పట్టణ కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన పని చేస్తుందని, రైతులకు సాగునీటి కష్టాలను తీర్చేందుకు మూడున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, డైరెక్టర్ నాగరాజు, ఆత్మకమిటీ వైఎస్ చైర్మన్ బాబుల్‌రెడ్డి, డైరెక్టర్ భిక్షపతి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, గ్రామ కో ఆర్డినేటర్ తీగుళ్ల నాగిరెడ్డి, నాయకులు ర్యాకల కృష్ణాగౌడ్, నారాయణగుప్తా, వెంకటేశ్‌గుప్తా, కమ్మరి సత్యనారాయణ, యాసిన్, కూచారం నరేశ్ ముదిరాజ్, మల్లికార్జున్‌గౌడ్, నంద్యాల శ్రీనివాస్, సత్యనారాయణగౌడ్, నరేందర్‌గౌడ్, నానిగౌడ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...