మెదక్‌లో కాళేశ్వరం సంబురాలు


Fri,June 21, 2019 01:03 AM

మెదక్ మున్సిపాలిటీ :జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో కాళేశ్వరం సంబురాలను నిర్వహిస్తున్నటు ్లమెదక్ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్న సందర్భంగా సంబురాలను నిర్వహిసున్నామన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల జీవితాల్లో ఆనందాలు తెస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిండితే మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు..
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నిర్వహించనున్న కాళేశ్వరం సంబురాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు రాందాస్ చౌరస్తాకు చేరుకోవాలని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం సంబురాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

పాపన్నపేటలో..
పాపన్నపేట: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కాళేశ్వరం ప్రారంభ సంబురాలను ఘనంగా జరుపుకోవాలని మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి కోరా రు.శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నందున ఆ యా గ్రామా ల్లో సంబురాలు జరుపుకు న్న అనంతరం మెదక్ పట్టణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్యర్యంలో 10 గంటల అనంతరం సంబురాలు జరుగుతాయని కార్యకర్తలు నాయకు లు మెదక్ పట్టణానికి తరలివచ్చి కాళేశ్వరం ప్రారంభ సంబరాలులో పా ల్గొని జయప్రదం చేయాల్సిందిగా ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

నేడు విజయోత్సవ ర్యాలీ
మెదక్ అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మెదక్ రైతు సమన్వయ సమితి కన్వినర్ మంగ రమేశ్‌గౌడ్ గురువారం తెలిపారు. ఈ విజయోత్సవర్యాలీకి పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు హాజరు కావాలని కోరారు.

టేక్మాల్‌లో...
టేక్మాల్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలను జరుపుకోవాలని మండల అధ్యక్షుడు యూసుఫ్ తెలిపారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసే సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవం నేడు జరుగుతుందన్నారు. దీనివల్ల బీడు భూముల్లో పచ్చని పంటలు పండి రైతులు ఆనందోత్సవాలతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సంబురాలను ఘనంగా నిర్వహించాలని ఆయన చెప్పారు. రైతు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్లు, సభ్యులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరుకావాలని కోరారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...