హరితహారంతో గ్రామాల్లో పచ్చదనం పెంచాలి


Fri,June 21, 2019 01:03 AM

చేగుంట:హరితహారంలో మొక్కలు నాటి ప్రతి గ్రామాన్ని పచ్చదనం చేయాలని చేగుంట ఎంపీపీ అల్లిరమ పేర్కొన్నారు.మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ అల్లిరమ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొనగా గ్రామాల్లోని సర్పంచులు,ప్రజాప్రతినిధులు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగ సంబంధిత అధికారులు జరిగిన అభివృద్ధితో పాటు,సమస్యలపై వివరణ ఇచ్చారు.ఈ సందర్భంగా చేగుంట ఎంపీపీ అల్లిరమ,ఎంపీడీవో ఉమాదేవి తహసీల్దార్ గోవర్ధన్ మాట్లాడుతూ హరితహారంలో గ్రామాల్లో మొక్కలు నాటుకోవాలని,గ్రామాలను పరిశుభ్రంగా ఉండే విధంగా తడి,పోడి చెత్తను వేరుగా చేసి చెత్తబండిలో వేయాలన్నారు.చివరి మండల సర్వసభ్య సమావేశం కావడంతో ఎంపీపీ అల్లిరమ,మండలకార్యాలయ సిబ్బంది ఎంపీటీసీలకు సన్మానించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్ణశోభరాణి,మండలపరిషత్ ఉపాధ్యాక్షుడు ఆకుల మల్లేశంగౌడ్,ఎంపీటీసీలు సులోచన,బట్టి విజయ, నీరుడి బాలనర్సింహులు, బోమ్మగారి సత్యంతో పాటు వివిధగ్రామాలకు చెందిన సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...