ప్లాస్టిక్ పై సమరం సాగిద్దాం


Fri,June 21, 2019 01:02 AM

పాపన్నపేట : పాపన్నపేట ప్లాస్టిక్ పై సమరం సాగించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీపీవో హనూక్ వెల్లడించారు. పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం, నార్సింగ్ గ్రామాల్లో గురువారం గ్రామస్తులకు ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉందామని సూచించారు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నామని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలోని నార్సింగి శివారులో డంపింగ్‌యార్డ్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గాజులగూడెం నార్సింగి గ్రామాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్ కాగితాలను ఏరి గ్రామ పొలిమేరకు తరలించారు. కార్యక్రమంలో పాపన్నపేట మండలం జెడ్పీటీసీ స్వప్నబాలాగౌడ్, గాజులగూడెం సర్పంచ్ జెస్ల్‌మెంట్ పాపన్నపేట ఎంపీడీవో రాణి ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...