గ్రామాల్లో స్వచ్ఛభారత్


Fri,June 21, 2019 01:02 AM

పెద్దశంకరంపేట: మండలంలలోని కమలాపురం, ఉత్తులూరు, కొత్తపేట గ్రామాల్లో గురువారం ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లోని పలు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, అనంత్‌రావు, నాయకులు శంకర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఎక్లాస్‌పూర్‌లో ..
టేక్మాల్: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో వ్యాధులు రాకుండా ఉంటాయని సర్పంచ్ దుర్గయ్య అన్నారు. మండల పరిధి ఎక్లాస్‌పూర్ గ్రామపంచాయతీలోని రంగన్నపల్లెలో గురువారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధుల్లో, మురుగు కాల్వల్లో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని తొలిగించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రాకేశ్ తదితరులు ఉన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...