భూములను రీసర్వే చేయండి


Wed,June 19, 2019 11:56 PM

కొల్చారం: ఘన్‌పూర్ ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల భూములు కోల్పోతున్నాం. రైతులకు ఎకరాకు రూ.15లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ముంపుకు గురికానున్న భూములను మరోసారి సర్వే చేయాలని ఘన్‌పూర్ గ్రామ ముంపు బాధితులు నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డికి మొర పెట్టుకున్నారు. మండల పరిధిలోని చిన్నాఘన్‌పూర్‌లో బుధవారం ముంపు భూములకు సంబంధించి భూసేకరణ కోసం గ్రామసభ నిర్వహించారు. ఘన్‌పూర్ ఆనకట్ట ఎత్తు పెంపుదల కోసం రూ.110 కోట్లు మంజూరు కాగ ఆనకట్ట వెడల్పు పనులు సాగుతున్నాయి. ఎత్తు పెంపుతో భూములు కోల్పోతామని, భూసేకరణకు సంబంధించి మంచి ప్యాకేజీ ఇవ్వాలని రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకోచ్చారు. బుధవారం గ్రామసభలో ఆర్డీవో అరుణారెడ్డి దృష్టికి రైతులు భూములను సరిగ్గా సర్వే చేయలేదన్నారు. రీసర్వే చేయిస్తానని, ఎకరాకు రూ.7.50లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. రైతులు ససేమిరా అనడంతో నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సహదేవ్, గ్రామ సర్పంచ్ ఇందిరాప్రియదర్శిని సందీప్, ఎంపీటీసీ పెంటమ్మ రత్నయ్య, సీడీసీమాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ రంగారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బాగారెడ్డి, లక్ష్మిపతి, నర్సింహులు, ముంపు బాధితులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...