ముగిసిన కన్యకాపరమేశ్వరి దేవాలయ ఉత్సవాలు


Wed,June 19, 2019 12:49 AM

చేగుంట : మండల కేంద్రమైన చేగుంటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయ ఉత్సవాలు ముగిశాయి. అంతసాగర్‌ సరస్వతీ క్షేత్ర నిర్మాత శ్రీ అష్టకాల నరసింహా రామశర్మ, చేగుంట ఆర్యవైశ్యసంఘం, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 56 రకాల నైవేద్యాలను సమర్పించారు. అదేవిధంగా పంచముఖి ఆంజనేయస్వామికి వివిధ పూజలు చేశారు. శ్రీ నగరేశ్వర స్వామికి కల్యాణమహోత్సవం, ఒడి బియ్యం తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాలలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

అనంతరం సరస్వతీ క్షేత్ర నిర్మాత శ్రీ అష్టకాల నరసింహా రామశర్మ భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో చేగుంట, నార్సింగి సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్‌, ఎర్రం అశోక్‌, ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, స్థానిక ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ కార్యదర్శి గంప శ్రీనివాస్‌, నాచారం దేవాస్థానం నిత్యాన్నసత్రం చిట్టిమిల్ల బాలాజీ గుప్తా, చేగుంట పట్టణశాఖ అధ్యక్షుడు తొడుపునూరి నగేశ్‌, హనుమయ్య, చేగుంట, నార్సింగి జెడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్‌, బాణపురం కిష్ణారెడ్డి, చేగుంట, దౌల్తాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు తాడెం వెంగళ్‌రావు, రణం శ్రీనివాస్‌గౌడ్‌, తహసీల్దార్‌ గోవర్ధన్‌, ఎంపీడీవో ఉమాదేవి ఆలయకమిటీ చైర్మన్‌ రాజేశ్వర్‌ సార్‌, హనుమయ్య, నాగభూషణం, బాలేశం, చంద విరేశం, సొసైటీ డైరెక్టర్‌ రఘురాములు, నారయణరెడ్డి, మహేశ్‌, దేశి ఈశ్వరయ్య, గొలి రమేశ్‌, నాగలింగం, రమణ, వడియారం, నాగభూషణం, కూన రాములు, బచ్చు రమేశ్‌, కృష్ణమూర్తి, వేణు సిద్ధిరాములు, గణేశ్‌, అంజయ్య, ప్రవీణ్‌, సురేశ్‌, మహిళా భక్తులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...