ప్రతి కేసును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి


Wed,June 19, 2019 12:49 AM

మెదక్‌, నమస్తే తెలంగాణ : విచారణలో గల ప్రతి కేసుల విచారణ వేగవంతం చేయాలని ఎస్పీ చందనదీప్తి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో క్యాలిటీ ఇన్వెస్టిగేషన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాత మరియు గత నెలలో జిల్లాలో జరిగిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణను వేగవంతం చేయాలని సూచించారు. విచారణలో గ్రేవ్‌ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ తరువాత నేర పరిశోధనలో పార్ట్‌-2లలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ మాత్రమే స్వయంగా రాత పూర్వకంగా వివరాలు నమోదు చేయాలన్నారు. నేరస్తులకు తక్కువ సమయంలో చట్ట ప్రకారం శిక్షపడేలా నాణ్యమైన విచారణ కొసాగలని, లాంగ్‌ పెండింగ్‌ కేసులను తొందరగా చేదించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల జరుగకుండా జిల్లాలోని రహదారులను కేటగిరిల వారీగా ప్రమాదాలు సంబవించే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, మలుపుల వద్ద సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి కేసు వివరాలు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలీసు అధికారికి సీసీటీఎన్‌ఎస్‌లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆన్‌లైన్‌ కేసులకు సంబంధించినవి ఎలాంటి పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ప్రతి మిస్సింగ్‌ కేసులను నిర్లక్ష్యం చేయరాదని, మిస్సింగ్‌ అయిన వారి ఫొటోలు పూర్తి సమాచారంతో జనసంచారం ఎక్కవగా ఉన్నటు వంటి ప్రదేశాల్లో పోస్టర్లతో తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకుని తక్కువ సమయంలో సులభమార్గంలో నేరాలను చేదించాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో రికార్డులతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలన్నారు. జిల్లా ప్రజలు ట్రాఫిక్‌ నియమనిభంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్‌ మీడియాను తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారుచేసే సందేశాలకు పూర్తిగా అడ్మిన్‌లదే బాధ్యత అని హెచ్చరించారు. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అక్రమ ఇసుక, మట్టి రవాణా చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సమీక్ష సమావేశంలో తూఫ్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌, తూఫ్రాన్‌ సబ్‌ డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...