విజయ డెయిరీ అభివృద్ధికి కృషి చేయాలి


Wed,June 19, 2019 12:48 AM

సిద్దిపేట అర్బన్‌ : ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీ అభివృద్ధికి రైతులు, సంస్థ సిబ్బంది, డెయిరీ సంఘాల ప్రతినిధులందరూ సమష్టిగా కృషి చేయాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట విజయ డెయిరీ ఆవరణలో జనరల్‌ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో చైర్మన్‌ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విజయ డెయిరీకి నాణ్యమైన పాలను సేకరించడంతో పాటు పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్నారు. త్వరలోనే పాడి రైతులకు సబ్సిడీ పాడి గేదెలను ప్రభుత్వం అందించనుందని తెలిపారు. పాడి రైతులకు నాణ్యమైన గడ్డివిత్తనాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలకు తగిన గిట్టుబాటు ధర కల్పిస్త్తుందన్నారు. పాల రైతులు సొసైటీలు ఏర్పాటు కానిచోట వెంటనే సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సమావేశంలో రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విజయ రైతులకు ఇచ్చే ఇన్‌సెంటీవ్‌ల చెల్లింపులో జా ప్యం జరుగకుండా చూడాలని కోరారు. రైతులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చైర్మన్‌ లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. డిప్యూటీ డైరెక్టర్‌ మోహనమురళి మాట్లాడుతూ.. పాడి రైతులు ప్రత్యేక చొరవ చూపి పాల ఉత్పత్తిని పెంచాలన్నారు. కార్యక్రమంలో విజయడెయిరీ మేనేజర్‌ గోపాల్‌సింగ్‌, డెయిరీ ప్రధానకార్యదర్శి మేఘనాథరెడ్డి, కోశాధికారి ఉప్పల్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, సూపర్‌వైజర్‌ సుమన్‌ పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...