ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలి


Mon,June 17, 2019 11:46 PM

-మరుగుదొడ్ల నిర్మాణాలు తొందరగా పూర్తి చేయాలి
-ప్రత్యేక అధికారులు మండలస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి
-తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలి
-ప్రజావాణిలో జిల్లా అధికారులకు కలెక్టర్ ధర్మారెడ్డి సూచన
మెదక్ కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. ఇందుకోసం అన్ని మండలాల ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో దశల వారీగా ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్తను వేర్వేరు సేకరణపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలను సంఘటితం చేసి చెత్తను వేరు చేసే విధానాలపై అవగాహన పెంపొందించాలన్నారు.

ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు రెవెన్యూ అంశాలపై 54 దరఖాస్తులు రాగా ఇతర అంశాలపై 34 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి న్యాయమైన వాటిని సత్వరం పరిష్కరించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో సీతారామారావు పాల్గొన్నారు.

-మెదక్ పట్టణంలోని వెంకటరావు నగర్ కాలనీలోని సర్వే.నం1128లోని వేణుగోపాల స్వామి దేవాలయ స్థలం అన్యాక్రాంతమవుతున్నదని, కొంత మంది వ్యక్తులు ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారని, వెంటనే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయించాలని మెదక్ పట్టణానికి చెందిన పూల మల్లేశ్ కలెక్టర్ ధర్మారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన కలెక్టర్ సర్వే.నం.1128 ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని మెదక్ తహసీల్దార్ రవికుమార్‌ను ఆదేశించారు. వేణుగోపాల స్వామి దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను నిలిపివేయించాలని మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ సమ్మయ్యను కలెక్టర్ ఆదేశించారు.

-కాళేశ్వరం కాలువల నిర్మాణంలో చేగుంట మండలం రాంపూర్ శివారులోని సర్వే.నం. 258లోని తన పట్టాభూమి 12 గుంటలు పోతున్నదని, ఈ భూమికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పించాలని చేగుంట మండలం కొల్లపల్లి గ్రామానికి చెందిన ఎస్.బాలయ్య కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

-కౌడిపల్లి మండలం నగ్సాన్‌పల్లి శివారులోని సర్వే.నం.92లో ఒక ఎకరం ఒక గుంట పట్టాభూమిని రికార్డుల్లో తప్పుగా నమోదు చేయడం వల్లతనకు రైతుబంధు ఆర్థిక సాయం, పట్టాపాస్‌పుస్తకంరావడం లేదని నగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతుఎ.సత్యనారాయణ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

-నర్సాపూర్ మండలం హన్మంతాపూర్ శివారులోనిసర్వే.నం 134లోని 3-15 ఎకరాల శ్మశాన వాటిక స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి విక్రయి స్తున్నారని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హన్మంతాపూర్ గ్రామానికి చెందిన శివ, శంకర్, చంద్రయ్య, విక్రమ్, లక్ష్మయ్య, వీరేశం, రమేశ్, శ్రీను తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

-గ్రామసేవకుల సమస్యలు పరిష్కరించాలని, ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలనే కొనసాగించాలని గ్రామసేవకుల సంఘం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

-ఎరుకల కుటుంబాలకు ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సాయం అందించాలని, స్వయం ఉపాధి పథకాలతో అర్హులైన వారికి ప్రయోజనం కలిగించాలనిజిల్లా ఎరుకల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...