జోరుగా అక్షరాభ్యాసాలు


Mon,June 17, 2019 11:41 PM

రామాయంపేట: మండలంలోని గ్రామాలు, తండాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. సోమవారం డీధర్మారం ప్రభుత్వ పాఠశాలలో రామాయంపేట వైస్ ఎంపీపీ ముస్కుల స్రవంతి సిద్ధిరాంరెడ్డి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. కిషన్ తండా పంచాయతీలో సర్పంచ్ సుభాష్‌నాయక్ ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేపట్టి పుస్తకాలను అందజేశారు. కోనాపూర్‌లో సర్పంచ్ దోమ చంద్రకళ, పర్వతాపూర్‌లో బోయిని దయాలక్ష్మి విద్యార్థులకు పుస్తకాలను అందజేసి బడిబాటలో పాల్గొన్నారు. అనంతరం వైస్ ఎంపీ పీ స్రవంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. బడిబయట ఉన్న పిల్లలు ప్రభుత్వ బడిలోనే విద్యనభ్యసించాలన్నారు. అనంతరం బడిబాటలో భాగంగా గ్రామంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.

వెల్దుర్తిలో..
వెల్దుర్తి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ప్రొ.జయశంకర్ బడిబాట మండలంలో కొనసాగుతుంది. బండపోసాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎంఈవో యాదగిరి, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వెంకటకిషన్, సర్పంచ్ నరేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ గౌరీ, పాఠశాల అధ్యాపకులు కిష్టయ్య, సంగమేశ్వర్, నవీన్, జాన్‌వెస్లీ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సర్పంచ్ నరేందర్‌రెడ్డి పలకలు, బ్యాగులను పంపిణీ చేశారు. అలాగే మాసాయిపేట ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాంలను అందిస్తున్నట్లు తెలిపారు.

చేగుంటలో..
చేగుంట: బడి బయట ఉన్న పిల్లలను మన బడిలో చేర్పించాలని కర్నాల్‌పల్లి సర్పంచ్ గణపురం సంతురెడ్డి పేర్కొన్నారు. బడిబాటలో భాగంగా కర్నాల్‌పల్లి, పోలంపల్లి, చిన్నశివునూర్, చెట్లతిమ్మాయిపల్లి, పులిగుట్టతండా, నడిమితండా పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యస్యం చేసి చిన్నారులకు మిఠాయులు తినిపించి పలక, బలపాలను అందజేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచుల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, మంచి భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, అనువజ్ఞులచే వి ద్యాభోదన, విశాలమైన తరగతి గదుల్లో విద్యాబోధన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాల్‌పల్లి, పొలంపల్లి పాఠశాల హెచ్‌ఎం సీహెచ్ సత్యనారాయణ, కర్రె సిద్ధిరాములు, సర్పంచులు ఎన్నెలి నిర్మల, చెట్లతిమ్మాయిపల్లి, నడిమితండా, చిన్నశివునూర్ మోహన్, హలవత్‌స్వాతి శ్రీనివాస్, కొఠారి అశోక్, వివిధ గ్రామాలకు చెందిన పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, విద్యార్థులు ఉన్నారు.

మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందని ఎంపీటీసీ మెట్టు బాలకృష్ణారెడ్డి, నాయకుడు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్‌లు అన్నారు. మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సోమవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల మౌళిక సదుపాయాలతో పాటు ఇంగ్లిష్ విద్య, సన్నబియ్యంతో ఉచిత మధ్యాహ్న భోజనం, రోజు గుడ్డు, యూనీఫాంలను అందజేస్తారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. అదే విధంగా మండలంలోని గౌతోజిగూడెం ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచులు రేణుకుమార్, ధర్మేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...