ప్లాస్టిక్‌ను విక్రయిస్తే కఠిన చర్యలు


Mon,June 17, 2019 11:41 PM

వెల్దర్తి: ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిసేధిస్తున్నామని, దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్దుర్తి సర్పంచ్ భాగ్యలక్ష్మి దుకాణదారులకు సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై సోమవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతనలో వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, దుకాణదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా వెల్దుర్తిలో ప్లాస్టిక్ వాడడాన్ని నిషేధిస్తున్నామన్నారు. ఎవరు 50 మైకాన్ల కన్న తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ఇతర వస్తువుల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలన్నారు. మాంసం దుకాణాలకు టిఫిన్ డబ్బాలను తీసుకువచ్చిన వారికి మాత్రమే మాంసం విక్రయించాలని సూచించారు. లేకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి రూ. 2,500, రెండోసారి రూ. 5 వేలు, మూడోసారి దుకాణ లైసెన్సును రద్దుచేసి దుకాణాన్ని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే దుకాణ లైసెన్సులను ఆన్‌లైన్ చేసుకుని, ఫీజును చెల్లించి దుకాణ లైసెన్సును పంచాయతీ కార్యాలయంలో పొందాలన్నారు. అంతకుముందు పట్టణంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. మండలంలోని కొప్పులపల్లి ఈవోపీఆర్డీ జయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్, నాయకులు, గ్రామస్తులు స్వచ్ఛభారత్ నిర్వహించి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సమావేశంలో ఈవో పద్మ, ఎంపీటీసీ సుధాకర్‌గౌడ్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, వార్డు సభ్యులు శాఖారం శ్రీను, ఇమ్రాన్, నాయకులు ఆంజనేయులు, మహేందర్, వ్యాపారస్తులు, రమేశ్‌గుప్తా, ప్రదీప్, సుధాకర్, రమేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు.

పారిశుద్ధ్ద్యంపై అవగాహన
చేగుంట: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం నిర్మూలనకు కృషి చేయాలని పోతాన్‌శెట్టిపల్లి సర్పచ్ నెల్లూర్ పేర్కొన్నారు. సోమవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో తడి, పొడి, చెత్తపై గ్రామస్తులకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సోమవారం ఐకేపీ సీసీ అంజ్యానాయక్, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించి చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ కవర్లను ఏరివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల రోగాలు ఈగలు, దోమలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ మొలుగు మహేందర్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం విజయసేనారెడ్డి, అంగన్‌వాడీ టీచర్ మంజుల, ఏఎన్‌ఎం అనురాధ, గ్రామస్తులు, వార్డు సభ్యులు ఉన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...