ఖైదీలకు జాబ్‌మేళా..


Mon,June 17, 2019 11:41 PM

-నూతన పంథాలో జైళ్లశాఖ
- విడుదలైన ఖైదీలకు ఉద్యోగ కల్పన
-22న హైదరాబాద్ డీజీ కార్యాలయంలో జాబ్‌మేళా
-21 వరకు దరఖాస్తుల స్వీకరణ
సిద్దిపేట టౌన్ : జైళ్లశాఖ సంస్కరణలకు పదును పెట్టింది. కొత్త పంథాను ఎంచుకొని నూతన అధ్యాయానానికి శ్రీకారం చుట్టింది. క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్షను అనుభవించి విడుదలైన ఖైదీల్లో వెలుగులు నింపనుంది. వారిలోని అర్హత, నైపుణ్యం తదితర వాటిని పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. నిరుద్యోగులకు జాబ్‌మేళా మాదిరిగా విడుదలైన ఖైదీలకు జాబ్‌మేళా ఈ నెల 22న నిర్వహించనుంది.

జైళ్లలో సంస్కరణలు
రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే జైళ్లశాఖ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. మొదట అవినీతి రహిత జైళ్లశాఖగా పేరుగాంచింది. నిరక్ష్యరాస్యులకు చదువు చెప్పించడం, నేరప్రవృత్తి వీడేలా తిరిగి తప్పు చే యకుండా మా నవ విలువలు పెంపొందించి మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం శిక్షణను ఇస్తున్నది. ఖైదీలు తయారు చేసిన వస్తువులను మైనేషన్ పేరిట విక్రయించి వారికి ఆర్థిక స్వావలంభన కల్పిసున్నది. సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసి గ్రామాలు, పట్టణాల్లోనూ యువతను చైతన్యపరుస్తూ ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేస్తున్నది. విడుదలైన ఖైదీలకు పెట్రోలు బంక్‌లలో ఉద్యోగాలను కల్పిసున్నది. నేర ప్రపంచంలోకి అడుగు పెట్టకుండా వారి సొంత కాళ్లపై నిలబడేలా జాబ్‌మేళాల పేరిట ఉపాధి, ఉద్యోగాల కల్పనకు నడుం కట్టింది.

22న జాబ్‌మేళా
విడుదలైన ఖైదీల సంక్షేమం కోసం వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఈ నెల 22న హైదరాబాద్ డీజీ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి జిల్లా జైలు, సిద్దిపేట, జోగిపేట, మెదక్ సబ్‌జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీల కోసం జాబ్‌మేళాను నిర్వహించనుంది.

21 వరకు దరఖాస్తుల స్వీకరణ
జాబ్‌మేళాలో పాల్గొనాలనుకునే వారికి ఈ నెల 15 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారుని పూర్తి పేరు, అడ్రస్, వయస్సు, స్త్రీ/పురుషులు, ఫోన్ నంబరు, విద్యార్హత, ఆయా వృత్తుల్లో నైపుణ్యత దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఎలాంటి ఉద్యోగం కావాలో.. నెల జీతం ఎంత ఉండాలో దరఖాస్తులో క్షుణ్ణంగా వివరించాలి. అనంతరం సంగారెడ్డి జిల్లా జైలు కానీ, సిద్దిపేట, జోగిపేట, మెదక్ సబ్ జైళ్లలో దరఖాస్తు అందించాలి.

వెలుగులు నింపుతున్నాం
ఖైదీల సంక్షేమం కోసం ఉ ద్యోగ ఉపాధి మార్గాలను కల్పిస్తున్నాం. విడుదలైన ఖైదీలకు కొత్త జీవితాన్ని అందిస్తు న్నాం. మొట్టమొదటి సారిగా జాబ్‌మేళాను నిర్వహిస్తు న్నాం. చదువు, వృత్తిలో నైపుణ్యం బట్టి వారికి తగిన ఉద్యోగాన్ని ఇస్తాం. ఈ నెల 21 వరకు దరఖాస్తులను ఆయా సబ్‌జైళ్లలో, సంగారెడ్డి జిల్లా జైలులో అందజేయాలి. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలో శిక్షణ అనుభవించి విడుదలైన వారందరు సద్వినియోగం చేసుకోవాలి.
- ఉమ్మడి జిల్లా జైళ్లశాఖ డీఎస్పీ వెంకటేశ్వర్లు

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...