ఘనంగా ఏరువాక పౌర్ణమి


Mon,June 17, 2019 11:41 PM

టేక్మాల్: ఏరువాక పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎద్దులకు రంగులు అద్ది, రంగు రంగుల తాళ్లతో అందంగా అలంకరించి ముస్తాబు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లోని దేవాలయాల చు ట్టూ ఎడ్లను ఊరేగించారు. గొల్లగూడెం గ్రామంలో ఎడ్ల బండ్ల అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ ఆనందోత్సవాలతో వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.

చిలిపిచెడ్‌లో..
చిలిపిచెడ్: ఏరువాక పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని ఆయా గ్రామాలలో రైతులు ఎద్దులకు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం చండూరు, చిట్కుల్, గౌతాపూర్ తదితర గ్రామాలలో రైతులు ఎద్దులకు బెల్లంతో తయారు చేసిన పానకాన్ని తాగించారు. ఎద్దులను గజ్జెలతో ప్రత్యేకంగా అలంకరించారు.

అల్లాదుర్గంలో:
అల్లాదుర్గం:వ్యవసాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమిని సోమవారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు.రైతులు తమ పశువులకు అందంగా అలంకరించాడని పలు రకాల సామగ్రిని కొనుగోలు చేసి రంగు రంగుల తాళ్లతో ముస్తాబు చేశారు.రైతులు తమ ఎడ్లను అలంకరించి వాటికి భక్షాలు తినిపించారు. అనంతరం ఎడ్లను ఊరేగించారు.వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు.

పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట : వ్యవసాయదారులు ఏరువాక పౌర్ణమిని సోమవారం పెద్దశంకరంపేట మండలంలో ఘ నంగా జరుపుకున్నారు.సాయంత్రం వ్యవసాయ దారు లు ఎద్దులు, పశువులను ప్రత్యేకంగా అలంకరించి గ్రా మాల్లోని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు.మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు తమ ఎడ్లను రంగురంగులతో ముస్తాబుచేసి వాటికి భక్షాలను తినిపించారు. వానకాలంలో వానలు భాగా కురిసి పంటలు బాగా పండాలని భగవంతున్ని ప్రార్థించారు. పట్టణంలోఈ సందర్భంగా ఎడ్లకు రం గులు, నూలు వస్ర్తాలతో అందంగా అలంకరించి సా యంత్రం స్థానికంగా రామాలయంలో ఉన్న హనుమాన్ దేవాలయం, గురుపాదగుట్ట శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...