వైద్యులకు భద్రత కల్పించాలి


Mon,June 17, 2019 11:40 PM

-కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన మెదక్ వైద్యులు
మెదక్ కలెక్టరేట్: వైద్యులకు ప్రభుత్వ పరంగా అవసరమైన రక్షణ చర్యలు కల్పించాలని మెదక్ పట్టణంలో ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులు కలెక్టర్ ధర్మారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కొన్ని సార్లు ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే వైద్యులపై రోగుల బం ధువులు దాడులకు పా ల్పడుతున్నారని అలాంటి సంఘటనల కారణంగా అత్యవసర సేవలకు చాలా మంది వై ద్యులు నిరాకరించే పరిస్థితి నెలకొందని వెం టనే పవిత్రమై న వైద్య వృత్తిలో ఉన్న తమకు ప్రభుత్వ పరంగా రక్షణ చర్యలు కల్పించాలని ఐఎంఏ పిలుపు మేరకు జిల్లా కేంద్ర దవాఖానలో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీ గా వచ్చి కలెక్టర్ ధర్మారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో సీనియర్ వైద్యులు సురేందర్, చంద్రశేఖర్, విజయకుమార్, శివదయాల్, భానుచందర్, జానకీ, అపర్ణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...