ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం


Mon,June 17, 2019 12:46 AM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ: గ్రామంలో పేరుకు పోయిన ప్లాస్టిక్ చెత్తను ఏరివేసి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని సర్పంచ్ శివకుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామంలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జరిపారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమానికి సర్పంచ్ శివకుమార్‌తో పాటు గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు చేతిలో చీపుర్లు పట్టుకొని గ్రామంలో అక్కడక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను సంచుల్లో సేకరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మహిళలు, యువకులు స్వచ్ఛందంగా వచ్చి గ్రామస్వచ్ఛత కోసం పాటుపడాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థ్యాలను ఇంట్లోనే పోగు చేసి ఉంచాలని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌గౌడ్, యువజన సంఘాల సభ్యులు రమేశ్, అశోక్, మల్లేశ్, నరేశ్, సత్యనారాయణ, వార్డు సభ్యులు మల్లేశ్‌గౌడ్, ప్రసాద్, అంజమ్మరాజు, నీలశంకర్, గ్రామస్తులు దశరథ, విఠల్, బాలరాజు ఉన్నారు.

రాందాస్‌గూడలో స్వచ్ఛభారత్
చిలిపిచెడ్: మండల పరిధిలోని రాందాస్‌గూడ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ అంకం యాదగిరి, ఉప సర్పంచ్ గణేశ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని ప్రతిఇక్కరూ స్వచ్ఛందంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని ప్రతి వీధిలో రోడ్లను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ గ్రామంలోని గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. గ్రామంలోని మురుగుకాలువలు, రోడ్లను శుభ్రపరచడం జరిగిందన్నారు. గ్రామంలో పెద్దలు, యువకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని ఇలానే కొనసాగించి గ్రామాన్ని పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అలాగే గ్రామంలో ప్రధాన వీధిల గుండా ప్లాస్లిక్ వ్యర్థాలను రోడ్లుపై వేయకుండా సంచుల్లో వేసి తగు జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...