టీపీటీఎఫ్ అధికార పత్రిక ఉపాధ్యాయదర్శిని ఎడిటర్‌గా


Mon,June 17, 2019 12:45 AM

-ఎండీ.అహ్మద్ ఎంపిక
మెదక్ మున్సిపాలిటీ : తెలంగాణ ప్రొగ్రెస్సీవ్ టీచర్స్ ఫెడరేషన్ మాసపత్రిక ఉపాధ్యాయదర్శిని ఎడిటర్‌గా మెదక్ పట్టణానికి చెందిన ఎండీ.అహ్మద్ ఎంపికైనట్లు టీపీటీఎప్ జిల్లా అధ్యక్షులు కాముని రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండీ.అహ్మద్‌గారు గతంలో కొల్చారం మండల ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కౌన్సిలర్‌గా పదవులు నిర్వహించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో సాహిత్య పరంగా క్రీయాశీలకంగా పని చేశారని తెలిపారు. అలాగే మంజీర రచయితల సంఘం మెదక్ పట్టణ ఉపాధ్యాక్షులుగా పని చేశారన్నారు. 2006లో పానాది అనే కవితల సంకలన పుస్తకాన్ని వ్రాసి మరసం 20 యేండ్ల మహాసభల్లో ఆవిష్కరించారని పేర్కొన్నారు. అనేక పత్రికలలో ఈయన కవితలు, ప్రచురణ అయ్యాయని తెలిపారు. అలాగే 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఉత్తమ మెదక్ సాహితి వేత్త అవార్డు పొందారన్నారు. కలెక్టర్ గారిచే ప్రశంసాపత్రం, జ్ఞాపిక మొదలగునవి అనేకం పొందారని తెలిపారు. 2018 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఉత్తమ కవి అవార్డు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గారి చేతుల మీదుగా నగదు బహుమతి పొందారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారన్నారు. ఎండీ.అహ్మద్ రాష్ట్రస్థాయి పత్రిక ఎడిటర్‌గా ఎంపిక కావడం పై మెదక్ జిల్లా శాఖ అభినందనలు తెలిపిందన్నారు. ఉపాధ్యాయదర్శిని ఎడిటర్‌గా ఎంపిక కావడం పై హర్షం వ్యక్తం చేసిన వారిలో కాముని రమేశ్, హీరాలాల్, జిల్లా కౌన్సిలర్ రాబిషన్, బాగన్న కొమ్మశ్రీనివాస్, ఫయాజ్, నసీర్, నసీరొద్దీన్, రాష్ట్ర కౌన్సిలర్స్ యాదగిరి, సంగయ్య టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కొండల్‌రెడ్డిలు ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...