గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ


Mon,June 17, 2019 12:44 AM

సిద్దిపేట అర్బన్ : వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్ 1, 2, 3, 4, ఎస్సై, కానిస్టేబుల్, ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా ఐదున్నర నెలల పాటు ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణ ఇస్తున్నామని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఉచిత శిక్షణపై ఆదివారం పలు కళాశాలల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫౌండేషన్ కోర్సుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.అభ్యర్థుల ఆదాయం రూ. 3 లక్షలు మించరాదని తెలిపారు. శిక్షణ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఉద్యోగ నోటిఫికేషన్‌లకు ఉపయోగపడుతుందన్నారు. ఉచిత మహిళలకు 33 శాతం, వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 30న సిద్దిపేటలో అర్హత పరీక్ష నిర్వహించి, 100 మందిని ఎంపిక చేస్తామని తెలి పారు. పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు జూలై 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఐదున్నర నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని తెలి పారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు శిక్షణతోపాటు ఉచిత వసతి, భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. అలాగే, రూ.2500 విలువచేసే స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.tssc studycircle. telangana.gov.in వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9182220112, 868683 5282, 9553167760 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ కోరారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...