భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం


Sun,June 16, 2019 12:29 AM

కొల్చారం : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. కొల్చారం మండల పరిధిలోని వరిగుంతంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో రైతులకు సంబంధించి భూ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పేర్లు తప్పుగా నమోదు కావడం, భూ విస్తీర్ణం తక్కుగా రావడం, ఫౌతీ, పట్టా మార్పిడి వంటి సమస్యలను వీఆర్వో దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఎవ్వరైనా అనువంశికంగా వచ్చిన భూముల్లో అన్నదమ్ముల గొడవలు ఉంటే, ప్రభుత్వ అసైన్‌మెంట్‌ భూముల కొనుగోలు దారులకు సంబంధించి భూములను పార్టు-బీ లో ఉంచడం జరిగిందని, వాటిని కూడా సర్వే చేసి వాస్తవంగా ఎవ్వరు ఉంటే వారి పేరు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అసైన్‌మెంట్‌ చేసిన భూములు అసలైన లబ్ధిదారుల దగ్గర లేకుంటే కొనుగోలు చేసినవారు నిరుపేదల రైతులైతే పీవోటీ చేసి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 15వ భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 95 శాతం భూ సమస్యలు పూర్తయినట్లు, ఇంకా అయిదు శాతం సమస్యలను పరిష్కరించి భూ వివాద రహిత గ్రామాలుగా తీర్చి దిద్దుతామన్నారు. ఇప్పటికే కొత్త పాసుపుస్తకాలు రాని రైతులు తమ భూములకు ఆధార్‌ నమోదు చేసుకోకుండా ఉండటంతోనే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీఆర్వోలు ప్రతి రైతుకు సమాచారం ఇచ్చి ఆధార్‌ను అనుసంధానం చేయించాలన్నారు. తహసీల్దార్లు డిజిటల్‌ సంతకాలను పూర్తి చేసి కొత్త పాసు పుస్తకాలను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సాపూర్‌ బండ అరుణారెడ్డి, జెడ్పీటీసీ మేఘమాల సంతోశ్‌, తహసీల్దార్‌ సహదేవ్‌, ఆర్‌ఐ బోనాల రాము, వీఆర్వోల బృందం పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...