నిరుపేదలకు అండగా ప్రభుత్వం కృషి


Sun,June 16, 2019 12:29 AM

మెదక్‌ మున్సిపాలిటీ : తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ ఉండటం వల్ల రాష్ట్రం అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుందని, ఆ ఉద్దేశ్యంతోనే యావత్తు తెలంగాణ ప్రజలు రెండోసారి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిపించారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రమైన మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెండ్లిళ్లకు కష్టమైన ఈ రోజుల్లో మేనమామలాగా ఉండి కల్యాణలక్ష్మి పథకం అమలు చేశారని గుర్తు చేశారు. దీంతో కల్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షా11 వేలను అందిస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌తో 104 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ఇంకా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు చేస్తానని అన్నారు. అర్హులైన వారికి పింఛన్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వికలాంగులకు రూ.1500 నుంచి 3వేలు, వృద్ధులకు, వితంతువులకు రూ.1000 నుంచి 2000 వరకు పింఛన్లు పెంచడం జరిగిందన్నారు. అంతేకాకుండా బీడీ కార్మికులకు కూడా పీఎఫ్‌ లేకుండానే పింఛన్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

హామీలన్నీ నెరవేరుస్తా...
మెదక్‌ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే మెదక్‌ నియోజకవర్గంలో రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇంకా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో జేసీ నగేశ్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మి, హవేళిఘనపూర్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌, కౌన్సిలర్లు చంద్రకళ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట : తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు మేనమామలాగా సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేసి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే ఎంపీపీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను 80 మంది లబ్ధ్దిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా సీఎం కేసీఆర్‌ ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్‌రెడ్డి, స్వామిగౌడ్‌, నవీన్‌, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తహసీల్దార్లు శేఖర్‌రెడ్డి, జయరాములు, నర్సింహ్మారెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌, కాట్రియాల శ్యామ్‌లు తదితరులు ఉన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...