ప్రైవేటు పాఠశాలకు మా పిల్లలను పంపించం


Sun,June 16, 2019 12:28 AM

హవేళిఘణపూర్‌: ప్రైవేటు పాఠశాలల ఫీజులమోత... తూతూ మంత్రంగా చదువుల వల్ల నష్టపోతున్నామని, దాంతో తమ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను పంపించమంటూ మండల పరిధిలోని తొగిట గ్రామస్తులు ఎంఈవో నీలకంఠానికి విన్నవించారు. శనివారం మండల కేంద్రమైన తొగిట గ్రామానికి వచ్చిన ప్రైవేటు బస్సులను అడ్డుకున్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండగా ప్రైవేటు విద్యా సంస్థలలో తమ పిల్లలను చదివించడం ద్వారా ఫీజుల భారంతో పాటు చదువుల్లో కూడా నాణ్యత లోపించిందని గ్రామస్తులు ఆరోపించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ శ్రీహరి మాట్లాడుతూ గ్రామస్తుల సూచన మేరకు తమ పిల్లలను తమ గ్రామంలోనే ఇంగ్లీష్‌ విద్యను ప్రారంభించుకొని విద్యాబోధన జరిపించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు గ్రామం నుంచి 80 మంది వరకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తుండగా అందులో దాదాపు 70 మంది వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేందుకు ముందుకు రావడంపై పలువురు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎంఈవో నీలకంఠం మాట్లాడుతూ తొగిట గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లితే విద్యార్థులకు మంచి చదువులు చదివేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి, లక్ష్మణ్‌, రాము, మంద కృష్ణ, దయాకర్‌, శ్రీనివాస్‌, పద్మారావు ఉన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...