కాళేశ్వరం ప్రాజెక్టు భూములిస్తాం


Sat,June 15, 2019 12:30 AM

రామాయంపేట : కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు కొన్ని రోజులుగా అడ్డు చెప్పిన రైతులు ఎట్టకేలకు అంగీకారానికి వచ్చారు. శుక్రవారం రామాయంపేట మండలం రాయిలాపూర్‌ గ్రామ రైతులు ప్రజా వేదికను ఏర్పాటు చేసి గ్రామానికి చెందిన 60మంది రైతులు 28 ఎకరాల భూమిని ఇచ్చేందుకు తీర్మానా పత్రాలను సర్పంచ్‌ నర్సాగౌడ్‌ ఆధ్వర్యంలో రామాయంపేట తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డికి అందజేశారు. 60 మంది రైతులతో తహసీల్దార్‌ అంగీకార పత్రాలతో పాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల అంగీకార పత్రంతో ఇక కొండ పోచమ్మ, కాళేశ్వరం పనులు వేగంగా నడుస్తాయని తెలిపారు. రైతుల ఒప్పందం ప్రకారం తీర్మానాల కాఫీ లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే రైతులకు పరిహారం డబ్బులను అందజేయడం జరుగుతుందన్నారు. రైతులచే ఫారం-1, ఫారం-2లపై సంతకాలను తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కొండపోచమ్మ కెనాల్‌, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రైతులంతా ఒప్పుకుని తీర్మాన పత్రాలపై సంతకాలు చేయడం మంచి పరిణామమని అధికారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డి, ఆర్‌ఐ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్‌ భూమగారి నర్సాగౌడ్‌, ఎంపీటీసీ సార్గు భాగ్యలక్ష్మి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...