ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య


Sat,June 15, 2019 12:24 AM

వెల్దుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని మాసాయిపేట సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొ.జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో ఉపాధ్యాయులు, విద్యార్థు లు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ర్యాలీ ని ర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించి, చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అనంతరం సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల వలన తల్లిదండ్రులకు ఆర్థిక భారం అధికమవుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఉచితంగా అందించడంతో పాటు మధ్యాహ్నం సన్నబియ్యంతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్నారు. పాఠశాల హెచ్‌ఎం భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ కృష్ణాగౌడ్‌, ఉప సర్పంచ్‌ నాగరాజు, శ్రీకాంత్‌రెడ్డి, నాగరాజు, పాఠశాల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...