భూ సమస్యలు పరిష్కరించి


Sat,June 15, 2019 12:23 AM

-మూడు రోజుల్లో పట్టాపాస్‌బుక్‌లు అందజేయాలి
హవేళిఘనపూర్‌ : రైతులకు సంబంధించిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించి మూడు రోజుల్లో పట్టాపాస్‌బుక్‌లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి తహసీల్దార్‌ వెంకటేశాన్ని ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని సర్దన గ్రామంలో రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలోని రైతులు సమస్యలను కలెక్టర్‌కు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫౌతీ తదితర సమస్యలను గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పరిష్కృతంగా ఉన్న సమస్యలను మూడు రోజుల్లోగా పరిష్కరించాలని తహసీల్దార్‌ వెంకటేశాన్ని ఆదేశించారు. అలాగే గ్రామంలో భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా పార్ట్‌-బీ రిజిష్టర్‌లో నమోదు చేసిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి తగాదాలు లేకుండా ఉండేందుకు గాను భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా త్వరితగతిన సమస్యలను పరిష్కరించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సాయిరామ్‌, ఎంపీపీ వైస్‌ చైర్మన్‌ గొల్ల రాధాకిషన్‌యాదవ్‌, గ్రామ సర్పంచ్‌ సుభాష్‌, తహసీల్దార్‌ వెంకటేశం, అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...