కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు


Sat,June 15, 2019 12:23 AM

కౌడిపల్లి: కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎంపీపీ చిలుముల పద్మానర్సింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి విద్యార్థులచే బడిబాట కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కౌడిపల్లిలోని పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రతిఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాబోధన చేయాలని, బడీడు పిల్లలందరూ బడిలో చేరాలని నినాదాలు చేశారు. అనంతరం కౌడిపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పద్మ మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి దనవంతుడి కుటుంబంలోని పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీవో కోటిలింగం, ఎంఈవో చంద్రశేఖర్‌, హెచ్‌ఎమ్‌లు దిలీప్‌సింగ్‌ఠాగూర్‌, మాధవిలత, ఉప సర్పంచ్‌ చంద్రం శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్‌ఎమ్‌సీ చైర్మన్‌ దుర్గయ్య, ఎంపీటీసీ గొర్రె శ్యామలరవి పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...