ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి


Sat,June 15, 2019 12:23 AM

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుందని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండల పరిధిలోని చంది గ్రామంలో బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అందుతుందని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏంఈవో బుచ్చ్యనాయక్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, స్థానిక సర్పంచ్‌ అనిల్‌ప్రసాద్‌రెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొల్చారంలో..
కొల్చారం: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. మెరుగైన విద్య అందుతుందని కొల్చారం తహసీల్దార్‌ సహదేవ్‌, ఎంఈవో నీలకంఠం అన్నారు. మండల కేంద్రమైన కొల్చారంతో పాటు అన్ని గ్రామాల్లో బడిబాట ర్యాలీలు శుక్రవారం ఆయా గ్రామ సర్పంచ్‌ల నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కొల్చారంలో తహసీల్దార్‌ సహదేవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి పాఠశాలల మనుగడకు ఆయా గ్రామాల సర్పంచులు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సర్పంచ్‌ కరెంటు ఉమారాజాగౌడ్‌, ఏఎస్సై మోతీలాల్‌నాయక్‌, రంగంపేటలో సర్పంచ్‌ బండి సుజాత రమేశ్‌, పైతరలో సర్పంచ్‌ వెల్మకన్నె సంతోష బడిబాట ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే వరిగుంతం పాఠశాలలో జెడ్పీటీసీ మేఘమాల సంతోశ్‌ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.

అంగన్‌వాడీ చిన్నారులకు పలకల పంపిణీ
కౌడిపల్లి: అంగన్‌వాడీ చిన్నారులకు ఉచితంగా పలకలను పంపిణీ చేశామని కౌడిపల్లి 8వ వార్డుసభ్యురాలు ఉడుత నాగరాణి పేర్కొన్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలోని అంగన్‌వాడీ-4వ కేంద్రంలో చిన్నారులకు స్థానిక వార్డు సభ్యురాలు ఉడుత నాగరాణిరాజుగుప్తా పలకలు, నోట్‌పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులచే ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త సంతోశ్‌ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...