మరో టీఎంసీ


Fri,June 14, 2019 12:43 AM

-మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌కు అదనంగా ఒక టీఎంసీ నీళ్లు
-పైప్‌లైన్, కాల్వ ద్వారా తీసుకొచ్చేలా ప్రయత్నాలు
-కాల్వ నిర్మాణం కోసం భూసేకరణపై దృష్టి
-ఇప్పటికే సొరంగ మార్గం, కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీరు
-గోదావరి నీటిని సాధ్యమైనంత వాడుకునేలా సర్కారు ప్రణాళిక
-ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
తొగుట: సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదారమ్మ నీళ్ల ను సద్వినియోగం చేసుకోవడానికి సీఎం కేసీఆర్ మరో ముం దడుగు వేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ నీళ్ల కోసం సొరంగ మార్గం ద్వారా నిర్మాణ పనులు పూర్తి కావస్తుండగా, దానికి అనుసంధానంగా కాలువ, పైప్‌లై న్ ద్వారా మరో టీఎంసీ నీళ్లను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరి నీళ్లను ఎక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. గో దావరి నుంచి నాలుగు నెలలు మాత్రమే నీళ్లను తీసుకునే అవకాశం ఉండడంతో, ఇప్పటికే పూర్తవుతున్న సొరంగ మార్గం ద్వారా ఒక టీఎంసీ నీళ్లకు తోడు మరో టీఎంసీ నీళ్లను తీసుకెళ్తే, సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్దేశంతోనే మిడ్ మానేరు నుంచి మల్లన్న అనంతగిరి రిజర్వాయర్ మీదుగా మల్లన్నసాగర్ వరకు మూడు పంప్ హౌస్‌ల ద్వారా పైప్‌లైన్, గ్రావిటీ ద్వారా నీళ్లు అందించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. అనుకున్న మేరకు పనులు కొనసాగితే, మరో 18 నెలల్లో అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే కాలువల కోసం భూసేకరణపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు.

నిర్మాణం ఇలా..
సొరంగ మార్గం ద్వారా నిర్మించిన పైప్‌లైన్‌కు అనుసంధానంగా మిడ్ మానేరు నుంచి సిరిసిల్ల మండలం వల్లంపట్ల, వెల్జిపూర్, రహీంఖాన్‌పేట, అనంతారం, తిప్పాపూర్ నుంచి అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీళ్లను మళ్లిస్తారు. అక్కడి నుంచి ఎల్లాయపల్లి, విఠలాపూర్, మాచాపూర్, చంద్లాపూర్, రామం చ, పుల్లూరు, చిన్నగుండవెల్లి, బూర్గుపల్లి, ఇర్కోడు, వెంకటాపూర్, ఎన్సాన్‌పల్లి, తడ్కపల్లి, బండారుపల్లి మెట్టు, ఘనపూ ర్, ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్ వద్ద పంప్‌హౌస్ వరకు నిర్మా ణం చేపట్టనున్నారు. మిడ్ మానేరు నుంచి పూర్తి స్థాయిలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం నీళ్లు రావడానికి గ్రావిటీ ద్వారా పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉండకపోవడంతో అందుకు మూడు ప్రాంతాల్లో పంప్‌హౌస్‌లు నిర్మించనున్నారు. సిరిసిల్ల మండలం వెల్జీపూర్, చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి, తొగుట మండలం తుక్కాపూర్ వద్ద పంప్‌హౌస్‌లు నిర్మించనున్నారు. పంప్‌హౌస్ నుంచి ఎత్తు ప్రాంతాల వరకు పైప్‌లైన్ ద్వారా అక్కడి నుంచి పంప్‌హౌస్ వరకు కాలువ ద్వారా గ్రా విటీ రూపేనా నీళ్లను మళ్లిస్తారు. కాలువ ద్వారా నిర్మాణం కో సం 300-100 మీటర్ల వెడల్పుతో భూ సేకరణ చేయనున్నా రు. ఇప్పటికే భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. భూసేకరణ అనంతరం పనులు చేపట్టనున్నారు. 18 నెలల్లో పనులు పూర్తి చేసేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అనంతగిరి ప్రాజెక్టులో 3.5, రంగనాయక సాగర్‌లో 3, మల్లన్న సాగర్‌లో 50, కొండపోచమ్మ ప్రాజెక్టు లో 21 టీఎంసీల నీళ్లు నిల్వ చేయనున్నారు. అలాగే, వీటిలో నీటిని నిల్వ చేయడంతో పాటు ఉమ్మడి మెదక్, నల్గొండ, వరంగల్, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చనున్నారు. హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలు తీర్చడానికి 30టీఎంసీల నీళ్లను కేటాయించనున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును సీ ఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. తెలంగాణను ఆకుపచ్చ ఖిల్లాగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉండడంతో మరో టీఎంసీ నీళ్లను తీసుకరావడానికి అంకురార్పన జరిగిందని చెప్పవచ్చు. రెండు టీఎంసీల నీళ్లతో ఇక్కడి ప్రాంతం గోదారమ్మ గలగలతో సస్యశ్యామలం కానున్నది.

గోదావరి నీళ్లను వినియోగించుకోవడానికే..
సిద్దిపేట జిల్లాలో ఉన్న అనంతగిరి, రంగనాయక సాగ ర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టులకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీళ్ల కోసం సొరంగ మార్గం ద్వారా చేపట్టిన పనులు పూర్తి కానున్నాయి. దీనికి అనుసంధానంగా మరో టీఎంసీ నీళ్లను మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు కాలువ, పైప్‌లైన్ ద్వారా నీళ్లను అందించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గోదావరి నీళ్లను అత్యధికంగా వినియోగించుకోవడం కోసమే మరో టీఎంసీ నీళ్ల కోసం ప్లాన్ వేశారు. తద్వారా ప్రతి రోజు రెండు టీఎంసీల నీళ్లను సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులకు అందించి, వాటి ద్వారా చెరువు, కుంటలకు, వ్యవసాయ, తాగునీటి, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాలువ పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది. భూసేకరణ అనంతరం పనులు సాఫీగా సాగితే, 18నెలల్లో కాలువ ద్వారా నీళ్లను అందుతాయి.
- రవీందర్‌రెడ్డి, ఈఈ , కాళేశ్వరం ప్రాజెక్టు

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...