ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులు వేగవంతం


Fri,June 14, 2019 12:41 AM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం ముట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనుల్లో వేగం పెంచనున్నట్లు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. భూసేకరణ వారం రోజుల్లో పూర్తి చేయడమే కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్న కొంత మం దికి సంబంధించిన భూములను కూడా త్వరలో ప్రభు త్వం స్వాధీనం చేసుకుంటుందని సృష్టం చేశారు. 600ఎకరాల భూసేకరణకు గానూ మరో 130 ఎకరాలను సేకరించాల్సి ఉందని, ఇందులో ఆరుగురికి చెందిన 35 ఎకరాలు అప్పగించడానికి తీవ్ర అలజడి సృష్టిస్తున్నారన్నా రు. ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా, అక్ర మ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు, వారం రోజు ల్లో సంప్రదింపుల ద్వారా అప్పగించకపోతే, తప్పని సరి పరిస్థితుల్లో సదరు భూములను ప్రజాప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. గురువారం ముట్రాజ్‌పల్లి, తున్కిబొల్లారం వద్ద నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ ఆర్‌అండ్‌ఆ ర్‌కాలనీల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. లిం గారాజ్‌పల్లి గ్రామస్తులతో మాట్లాడారు. అంతకు ముం దు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, రింగ్‌రోడ్డు పనులను వేగవంతం చేయాలని, నిర్మాణ ఏజెన్సీలకు సూచించా రు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో విజయేందర్ రెడ్డి, కాళేశ్వ రం ఎస్‌ఈ వేణు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, రెవె న్యూ తదితర శాఖల ఆధికారులు పాల్గొన్నారు.

నెల రోజుల్లో పూర్తి చేయాలి..
మల్లన్నసాగర్, కొండ పోచమ్మ భూనిర్వాసితులకు త్వరలో ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, నెల రోజుల్లోగా ముట్రాజ్ పల్లి, తున్కిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణం పూర్తి చేయాని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముట్రాజ్‌పల్లి వద్ద మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కోసం 600 ఎకరాలు అవసరం కాగా, ఇందులో 130 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. 6వేల ఇండ్ల ప్లాట్లు ఏర్పాటు చేస్తుండగా, 2500 ఇండ్లు నిర్మిసున్నట్లు తెలిపారు. సకాలంలో కాలనీల నిర్మాణం పూర్తి చేయాలని, అవసరమైతే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసుకుని రాత్రి నిర్మాణాలు చేపట్టి, పనుల్లో వేగం పెంచాలన్నారు. అలాగే, అధికారుల రింగ్ రోడ్డు పనులను కూడా వెంటనే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు.

ఆరుగురికి వారం రోజుల గడువు
స్థానిక రైతులు తమ భూములను అప్పగించగా, కొం త మంది స్థానికేతరులు అక్రమంగా పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేసుకున్న ఆరుగురికి చెందిన 35 ఎకరాల భూమిని త్వరలో కోర్టు నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. నర్సాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే రోజు ఎనిమిది డ్యాక్యుమెంట్ల ద్వా రా పట్టా చేసుకున్నారన్నారు. వారికి వారం రోజులు గ డువిస్తున్నట్లు ప్రకటించారు. ఆలోగా చర్చల ద్వారా అ ప్పగిస్తే సరేనని, అడ్డు వస్తే పీడీ యాక్ట్ నమెదు చేస్తామని హెచ్చరించారు. వారం రోజుల్లో వారిలో స్పందన లేకుం టే, అన్ని పనులు ఎలాంటి సంప్రదింపులు లేకుండా జరిగిపోతాయన్నారు. ప్రజాప్రయోజనాల కోసం కొందరి భూముల సేకరణలో వెవకాడే ప్రసక్తే లేదని కలెక్టర్ స్ప ష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారి భూ ములను విడిచి పెట్టమని, తప్పని సరిగా సేకరిస్తామని తేల్చి చెప్పారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...