చెరువులు, కుంటలకు జియో ట్యాగింగ్


Fri,June 14, 2019 12:41 AM

రామాయంపేట : నీటి నిల్వలు పుష్కలంగా ఉండే చెరువులు, కుంటలకు కేంద్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేస్తుందని, వీటి నుంచి నీటి నిల్వలను సమృద్ధిగా వాడుకోవడానికి వీలుంటుందని మెదక్ డివిజన్ గణాంక అధికారి యాదగిరి పేర్కొన్నారు. గురువారం రామాయంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెండు మండలాలకు చెందిన కార్యదర్శులు, ఉపాధి, తదితర సిబ్బందికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్ననీటి వనరులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. రెండు మండలాల్లోని నీటినిల్వలు ఉండే చెరువులు, కుంటల ప్రదేశాలను గుర్తించి ఆ కుంటలనే జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. ఈ జియో ట్యాగింగ్ వల్ల రైతులకు భూగర్భ జలాలు వృద్ధి చెంది ఎంతో మేలు జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులను గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపడుతామని అన్నారు. వీటినే కాకుండా అడవుల్లో ఉండే వనరులను సైతం గుర్తించేలా చర్యలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఎస్‌వో కృష్ణ, సీఎస్ అరుణ్‌కుమార్, సీఎస్ సారిక, ఇరిగేషన్ ఏఈ శ్యాంకుమార్, ఈవోపీఆర్డీ వెంకటలక్ష్మి, మద్దెల భరత్ తదితరులు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...