విజిలెన్స్‌దాడుల్లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత


Thu,June 13, 2019 12:30 AM

గజ్వేల్ నమస్తేతెలంగాణ: నకిలీ విత్తనాల ముఠాను ప్రత్యేక విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాలను వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని రైతులకు రహస్యంగా విక్రయిస్తుండగా.. ములుగు, వర్గల్ మండలాల్లో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా బుధవారం ఆకస్మికంగా చేపట్టిన దాడుల్లో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. గతంలో బైండోవర్ అయిన 15 మందికి హెచ్చరికలు జారీ చేసిన్పటికీ వారిలో ఎలాంటి మార్పురాలేదని గమనించిన అధికారులు 15 రోజులుగా వారిపై ప్రత్యేక నిఘాపెట్టగా నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాదారం గ్రామానికి చెందిన షేక్‌ఖాదర్‌వలీ అనే వ్యక్తితో పాటు అంబర్‌పేటకు చెందిన కృష్ణ, గిర్మాపూర్‌కు చెందిన మహేశ్, దండుపల్లికి చెందిన రవీందర్, చందాపూర్‌కు చెందిన శౌరీ, శాఖారంకు చెందిన కృష్ణలు, గుంటూరు జిల్లా దామరపల్లి గ్రామానికి చెందిన ఆలపాటి శ్రీనివాసరావుతో నకిలీ విత్తనాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అధిక దిగుబడులను ఇవ్వడంతోపాటు వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటుందని రైతులకు నచ్చజెప్పి సదరు నకిలీ ముఠా పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గోకులకృష్ణ, పల్లవి, అనే పేర్లతో ప్రత్తి విత్తనాల ప్యాకెట్లను ఒక్కో కవర్‌లో 450గ్రాముల నకిలీ ప్రత్తి విత్తనాలను ప్యాక్‌చేసి రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేశారు. వీటితోపాటు 1365 కిలోల పత్తి విత్తనాలను దాడుల్లో అధికారలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా 34లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. వర్గల్ మండలం మాదారం, శాఖారం కేంద్రంగా వీటిని విక్రయిస్తున్నారనే అనుమానంతో విజిలెన్స్ అధికారులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. అనుకున్నట్లే వారు ఎప్పటిలాగే నకిలీ పత్తి విత్తనాలు రహస్యంగా విక్రయించడానికి చేస్తున్న ప్రయత్నాలను అధికారలు ముందుగానే పసిగట్టి వల పన్ని పట్టుకున్నారు. విత్తనాలతో పాటు ముఠా సభ్యులును అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో వర్గల్ మండలం శాఖారం, మాదాపూర్, గిర్మాపూర్, చందాపూర్, ములుగు మండలం శ్రీరాంపూర్, నర్సాపూర్ గ్రామాల్లో అక్రమంగా నిలువ ఉంచిన 1365కిలోల నకిలీ పత్తి విత్తనాలను, విక్రయానికి సిద్ధం చేసిన పత్తి నకలీ విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులులేని నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ దాడుల్లో విజిలెన్స్ విభాగం ఎస్పీ మనోహర్ ఆధ్వర్యంలో సీఐలు వినాయక్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ములుగు ఏడీఏ అశోక్‌కుమార్, ఏవో ప్రగతి, పోలీస్ సిబ్బంది సంజీవరెడ్డి, శివానంద్, విజయ్, చరణ్, ఏఈవోలు మల్లేశ్, పృద్వీ ఉన్నారు.

విత్తనాల స్వాధీనం.. పలువురిపై కేసు
వర్గల్, ములుగు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన నకిలీ పత్తి విత్తనాల విక్రయ బృందాన్ని పట్టుకున్నాం. వీరు ఆంధ్ర తదితర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలను తీసుక వచ్చి గ్రామాల్లో రైతుకు రహస్యంగా విక్రయిస్తున్నారు. గతంలో వీరిపై నిఘా పెట్టినా విత్తనాలు దొరకలేదు. ఈ సారి మెదటినుంచి కట్టు దిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ వీరు తమ వైఖరిని చామార్చు కోకుండా విత్తనాలు అమ్మకానికి ప్రయత్నాలు చేయడంతో తాము ముందుగాను నిఘా ఉంచడంతో తమకు అందిన సమాచారంతో పట్టుకోవడం జరిగింది. ఇంకా అనుమతులులేని నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...