నేర విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలి


Thu,June 13, 2019 12:28 AM

మెదక్ మున్సిపాలిటీ : తెలంగాణలోని అన్ని జిల్లాల పోలీస్‌స్టేషన్లలో నేరాల నియంత్రణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కన్ఫరెన్స్‌లో సమావేశంలో ఎస్పీ చందనదీప్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వం పోలీసు నుంచి ఏ విధమైన సేవలు ఆశిస్తున్నారో జిల్లా పోలీసు అధికారులకు తెలిపారు. ముఖ్యంగా చట్టాలను అమలు పర్చేముందు ముందుగా పోలీసులు అధికారులు చట్టాలను పాటించాల్సి ఉంటుందని తెలిపారు. పోలీసు డిపార్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టం పనితీరు భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో చాలా బాగుందని, ప్రజలకు పోలీసు శాఖ తరఫున మంచి సేవలు అందించాలనే భావనతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కమ్యూనికేషన్ సిస్టంతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. అలాగే నేర విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏదైనా నేరం జరిగినప్పుడు చట్ట ప్రకారం ఒక క్రమ పద్ధతిలో నేర విచారణ చేయాలని సూచించారు.

నేరం ఎప్పుడు, ఎక్కడ ఎలా జరిగింది అనే దానిపైన అవగాహన కలిగి ఉండాలని, నేర విచారణ ప్రక్రియలో భాగంగా నేరానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని చట్ట ప్రకారం నమోదు చేసి కోర్డు వారికి పంపాలని, ఆ నేరానికి సంబంధించి సాక్షుల విచారణ వారి సాక్ష వాంగ్మూలం నిష్పక్షపాతంగా ఉండాలని, తద్వారా నేరస్తులకు శిక్షణ పడేలా నేర విచారణ ప్రక్రియ కొనసాగాలని సిబ్బందికి సూచించారు. అలాగే నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరస్తులపై నిఘా పెంచడం, నేరాల అదుపు, నేర పరిశోధనలో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ త్వరితగతిన నేరాలకు సంబంధించిన వాస్తవాలను కనిపెట్టడం, అదే విధంగా ఏదైన నేరం జరిగినప్పుడు ఆ నేరస్థులం నేరచిత్రం తయారు చేయుటలో ప్రాముఖ్యత నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అల్లాదుర్గం సీఐ రవీందర్‌రెడ్డి, రామాయంపేట సీఐ వెంకట్‌రెడ్డి, తూప్రాన్ సీఐ లింగేశ్వర్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, పట్టణ సీఐ వెంకట్, డీసీఆర్‌బీ సీఐ చందర్‌నాయక్, ఎస్‌బీ ఎస్‌ఐ శ్రీరాంబాబు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...