వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే


Thu,June 13, 2019 12:28 AM

చేగుంట: వడియారం మైనంపల్లి గార్డెన్‌లో జరిగిన వివాహ వేడుకలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు మ్యాకల పరమేశ్ కవితల కూతురు మనిషను రెడ్డిపల్లికి చెందిన అంతు నర్సింహులు లక్ష్మిల కుమారుడు మహేందర్ వివాహం మైనంపల్లి గార్డెన్‌లో బుధవారం జరిగింది. ఈ వేడుకలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వేంట చేగుంట టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడెం వెంగల్‌రావు, జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, చేగుంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...