నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం


Tue,June 11, 2019 11:46 PM

-14 నుంచి బడిబాట
మెదక్, నమస్తే తెలంగాణ: జూన్ 1 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. జూన్ 2 నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉండటంతో జూన్ 1తేదీన పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. దీంతో ఆవిర్భావ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించడంతో పాటు జిల్లా స్థాయిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు విద్యార్థులు అందుబాటులో ఉండాలని బావించింది. ఈ సారి ఎండల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉండటంతో పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఆలోచించి విద్యార్థులకు ఎలాంటి ఇంబ్బందులు లేకుండా జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు తొలిరోజు అందనున్న పుస్తకాలు...
విద్యార్థులకు పాఠశాలల పునఃప్రారంభం రోజునే ప్రభుత్వం మార్గదర్శకాల ఆధారంగా పుస్తకాలు అం దించనున్నారు. పుస్తకాలు ఈపాటికే జిల్లా కేంద్రం నుం చి మండల కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి పాఠశాలలకు పంపడం జరిగింది.
14 నుంచి 19 వరకు బడి బాట..
జూన్ 14 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఇంటింటి ప్రచారంతో పాటు ప్రత్యేకంగా ఉన్నతాధికారులు రూపొందించిన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మండల, జిల్లా స్థాయిలో బడిబాట డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రతి రోజు కార్యక్రమాలను అధికారులు సమీక్షించనున్నారు. ఈ మేరకే విద్యాశాఖ ఉన్నతాధికారులు రోజు నిర్వహించాల్సిన కార్యాచరణను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలపై వివరిస్తూ ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రణాళికలను రూపొందించి బడిబాటను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...